Monday, 19 March 2018

ఉగాది



                          ఉగాది పండుగ ప్రాశస్త్యం


                  
యుగానికి ఆదిగా జరుపుకునే పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావటం చేత పకృతిలో ఉన్న చెట్లన్ని కొత్త లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో పచ్చగా కళకళ లాడుతూ శోభాయమానంగా కనిపించే సుందర దృష్యాలను చూసి కోయిలలు పులకరించి మన వీనులకు విందు కలిగించే కమ్మని స్వరాలతో ఆనందింప జేస్తాయి.

తెలుగువాళ్ళు ఏటేటా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగలలో తొలిపండుగ ఉగాది.
ఈ పండుగకు మరికొన్ని పేర్లు: యుగాది, సంవత్సరాది.

✨ ఉగాది :- ఉగ – నక్షత్రగమనం , ఆది – నక్షత్రగమనం మొదలుపెట్టిన సమయం. అందువలన ఉగ + ఆది = ఉగాది.

✨ మరొక వివరణ :- బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటిరోజు. ప్రభవనామ సంవత్సరం ఆదివారం వచ్చింది కనుక యుగ + ఆది  - యుగాది అయ్యింది.

" చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని
వత్సరాదే వసంతాదే రసరాద్సే తదైవచ "

చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ద పాడ్యమి రోజున ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలవారు ఉగాది పండుగను జరుపుకొంటారు. అయితే తమిళులు, మలయాళీలు, మనలా చాంద్రమానం కాకుండా సౌరమానం పాటిస్తారు.

ఈ ఉగాది పండుగకు ప్రాంతాల వారిగా వివిధ పేర్లు ఉన్నాయి.

✨  తెలుగువారు – ఉగాది, 
✨  మరాఠీవారు – గుదిపడ్వగా, 
✨  తమిళులు – వర్షవరుప్పు, 
✨  మలయాళీలు – విషు,
✨  సిక్కులు – వైశాఖీ, 
✨  బెంగాలీలు – పోయ్ లా బైశాఖ్.

పేరు ఏదైనా ఈ పర్వదినం సర్వత్రా సంతోషాన్ని కలుగచేస్తున్నది.

 ✨ ఉగాది పండుగ జరుపుకొనే విధానం  ✨


18 మార్చి 2018 ఆదివారం రోజు శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది పర్వదినంగా పంచాంగాలు, నిర్ణయ సింధూ, ధర్మ సింధు, మూహూర్త సింధువుల ద్వార నిర్ణయం తీసుకోవడం జరిగింది.


ఉగాది పర్వదినాన మొదటగా గృహాన్ని కడిగి పరిశుభ్రం చేస్తారు. ముంగిట్లో ఆవు పేడతో కళ్ళాపి చల్లి రంగోలి ముగ్గులు వేసి, ఇళ్ళ ప్రవేశ ద్వారాలకు మామిడాకుల తోరణాలతో అందంగా అలంకరిస్తారు. మామిడి ఆకులు మరియు కొబ్బరికాయలు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవిగా భావించబడతాయి. ఈ పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు,పెద్దలు శాస్త్ర విధిగా తలంటు స్నానం,నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. నుదుట బొట్టును పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని తరువాత భగవంతుని ప్రార్ధించాలి. అంతేకాకుండా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహంలో పెద్దల ఆశీస్సులను తీసుకొని, షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించిన పిదప ఆలయ సందర్శన చేసిన తదుపరి పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు.

                  ✨ ఉగాది పచ్చడి విశిష్టత ✨

మిగిలిన పండుగలకు,  ఉగాది పండుగకు వున్న ప్రత్యేకమైన తేడా ‘ఉగాది పచ్చడి’. ఈ ఉగాది పచ్చడికున్నంత ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన జీవితంలోని అన్ని అనుభూతులను వివరిస్తున్న ఈ షడ్రుచులతో  కూడిన పచ్చడి తినడం అందరికీ తప్పనిసరి.  ఈ పచ్చడి తయారీకి ఉపయోగించే పదార్థాలకు ఉన్న లక్షణాలు కూడా ప్రత్యేకం.

పచ్చడి తయారీలో ఉపయోగించే
✴️ బెల్లం –తీపి -  ఆనందానికి ప్రతీక. 
✴️ కొత్త చింతపండు –పులుపు – నేర్పుగా                           వ్యవహరించుటకు, 
✴️ వేప -చేదు -జీవితం లోని కష్టకాలాలు, 
✴️ పచ్చి మామిడికాయ – వగరు – జీవితంలో                     ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం, 
✴️ ఉప్పు – రుచికోసం – ఉత్సాహం నింపుటకు, 
✴️ కారం – సహనం కోల్పోవడం  వంటి లక్షణాలను               సూచిస్తాయి.


ఈ షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పరిగడుపున తినడం జరుగుతుంది. ఈ ప్రకియంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలంలో వచ్చే కాయలను పండ్లను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావదృష్టి గ్రహించే పరమార్ధం ఏమిటంటే మానవుడు తన జీవితంలోని సుఖదుఖాలను, మంచి,చెడులను సంతోషంగా ఎదుర్కోవాలి అని. మనిషికి కష్టం కలిగినపుడు కృంగక, మంచి జరిగినపుడు గర్వపడక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగించాలని భావం.
అందువలన మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టం, సుఖం, బాధ, ఉత్సాహం, సవాళ్లు మొదలైన అనుభవాలకు ఈ ఉగాది పచ్చడి సంకేతం. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఉగాది పచ్చడిని రుచి చూడాలి.


ఉగాది రోజున తలస్నానం చేసి క్రొత్త దుస్తులు ధరించడం ఆనవాయితీ. ముందుగా ఉగాది పచ్చడిని సేవించాలి. ఈ రోజున ఎలా గడుపుతామో సంవత్సరమంతా అలాగే గడుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ రోజున చాల ఆనందంగా గడుపుతారు.

                ✨ ఉగాది పంచాంగ శ్రవణం ✨

ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడం ఆంతర్యం ఎమిటంటే ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల స్థాన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాశులు, 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని కాల గణనం చేస్తూ వస్తున్నాము.

అందుకు ఈ నూతన తెలుగు సంవత్సరాది నాటి నుండి సంవత్సర కాలం పాటు వ్యక్తి జాతక రాశి జన్మనామం ఆధారంగా గోచార గ్రహా ఫలితాలు ,ఆ సంవత్సరంలో జరగబోయే మంచిచెడులు, వర్షపాతం, రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి, తాను,కుటుంబం,దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహస్థితి గతులను ఆధారంగా తరుణోపాయాలను తెలుసుకోవడాని అవకాశం ఉంటుంది.



ఈ పంచాంగ శ్రవణం ద్వారా, జరగబోయే విపత్తులనుండి ముందే తెలుసుకుంటాము. కాబట్టి శాస్త్రాన్ని నమ్మిన వారికి వారి వారి వ్యక్తిగత జాతక ఆధారంగా కొంత ముందస్తుగా జాగ్రత్త పడే అవకాశం అభిస్తుంది. త్రేతాయుగం, ద్వాపర యుగ కాలం నుండి మొన్నటి రాజుల కాలంతో సహా పంచాంగ శ్రవణాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ వస్తున్నారు.

ఆధునిక కాలంలో కొంత మందికి ఈ శాస్త్రం పై అవగాహనలేక శాస్త్రీయ పద్ధతులు తెలియక, ఆచరించక అయోమయస్థితిలో జీవితాన్ని కొనసాగించడం గమనిస్తునే ఉన్నాం, అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. మన పూర్వీకులైన ఋషులు మన బాగోగులు కోరి ఎంతో తపోనిష్టతో అనుభవ పూర్వకంగా, పరిశోధనల ద్వారా ఖగోళంలో అనేక నక్షత్రాలు ఉన్నా, ఒక నిర్ధిష్టమైన కక్ష్యలో తిరుగుతూ భూమిపై ఏవైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఖగోళంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు భూమి మీద నివసించే మానవునిపై చూపే ప్రభావానికి అనుగుణంగా భారతీయ జ్యోతిష అధ్యయనం ద్వారా ఫలితాలను అంచనా వేసి శాస్త్ర పద్ధతులను,తగు జాగ్రత్త సూచనలు చేసారు.

                   ✨ బ్రహ్మ దేవుని ఆరాధన ✨

నూతన సంవత్సర ఆరంభం రోజున బ్రహ్మదేవున్ని ప్రార్ధిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మదేవున్ని ప్రార్ధించే ఏకైక పండగ ఈ ఉగాదే. గౌరీ వ్రతము, సౌభాగ్య వ్రతాలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోముకుడి బారి నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికిచ్చిన రోజు, సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజే ఉగాది.

ఈ పండగను ప్రజలందరు జరుపుకుంటారు. ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణులు ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారు. ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంటికి, వ్యాపార సంస్థలకు సున్నాలు, రంగులు వేసుకుని చక్కగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుని ఉగాదికి ఒక రోజు ముందే అమవాస్య రోజునాడే పూజ ప్రారంభం చేస్తారు. పనిముట్లను శుభ్రపరచుకుని కులదైవాలైన విశ్వకర్మ భగవానుని, కాళికాదేవి అమ్మవారి,బ్రహ్మగారి పటాలకు నానావిధ పత్ర,పుష్పాలతో సుగంధ పుజా ద్రవ్యాలతో అలంకరించుకుని అఖండ దీపారాధన చేసి నిష్టతో పూజిస్తారు, దేవునికి ప్రత్యేకంగా "పడి" అనే మహానైవెద్యాన్ని మర్రి ఆకులతో విష్ణు చక్ర ఆకారంలో కుట్టి అందులో నివేదన చేస్తారు. వారు తినేందుకు పచ్చని మోదుగ ఆకులతో విస్తర్లు తయారు చేసుకుని ఏక భుక్త భోజనం చేస్తారు.



ఈ అఖండ దీపం కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకుని మరుసటి రోజైన ఉగాది నాటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి పంచాంగ ఫలితాలను చూసుకుని ఆ రోజు కూడ నిష్టతో ఉంటారు. అఖండ దీపారాధన చేసిన మూడవ రోజు శుభముహూర్త శుభ ఘడియలలో కులదేవతలకు మహా నైవేద్య నివేదన చేసి మహాహారతినిచ్చి అఖండ దీపాన్ని, పూర్ణకలశాన్ని ,పనిముట్లను కదిపి (ఉద్వాసన చేసి) ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతపూజ చేసుకుని మూడు రోజుల పూజదీక్షనుండి విరమణ పొందుతారు. తిరిగి వారి వారి వ్యాపారంలో నిమగ్నమౌతారు.

ఈ విధంగా భారత దేశ హిందువులు ప్రకృతి అందించే కొత్తగా వచ్చే ఫల,దాన్య సంపందను తాను అనుభవిస్తున్నందుకు కృతజ్ఞతాభావం చేత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని తిని ఆ రోజే జ్యోతిష పండితులను కలిసి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు,ఈ పర్వదినం ప్రకృతి "సంపద" పండగా గుర్తించి దైవ దర్షనాలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

           ✨ వసంత ఋతువు వాతావరణం ✨


వసంత ఋతువు మొదలయ్యే రోజులు కనుక ఎక్కువ చలీ కాకుండా, ఎక్కువ ఎండా కాకుండా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది.  చెట్లు కొత్త చిగుళ్ళతో ఉండి ప్రకృతి చాలా చాలా అందంగా ఉంటుంది . కోయిల పాడే కమ్మని పాటలతో మావి చిగుళ్ళతో మనస్సు ఆనందతాండవం చేస్తుంది. తెలుగువారికి మాత్రమే సొంతమైన పద్యపఠనం, పంచాంగ శ్రవణం, కవితా గోష్టులు, కవితా గానాలు, రసఙ్ఞులను ఆనందడోలికలలో  ఊపుతాయి.
             
                      ✨ ఉగాది వంటకాలు ✨


పండగ అంటే ప్రత్యేక వంటలు అనేది సర్వసామాన్యం.  ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో  పులిహోరా, బొబ్బట్లు, బూరెలు తప్పనిసరి. ఇంటికి అలంకరణ రకరకాల ముగ్గులు, మామిడి తోరణాలు మొట్టమొదట పండుగకు ప్రత్యేక ఆహ్వానాలు.  పండుగ సంప్రదాయాలు మనిషి జీవితానికి ఉత్సాహభరితాలు .

                    ✨ ఉగాది శుభాకాంక్షలు ✨


ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఒకరినొకరు "నూతన ఉగాది శుభాకాంక్షలు" తెలియపరచుకోవటం పరిపాటి. పిల్లలు పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొంటారు. 

ముఖ్యముగా ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కువ శాతం ప్రజలు ఫేస్బుక్, వాట్స్అప్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ వంటి మాధ్యమాల్లో తెలుగులోనే ఎంతో ఆకర్షణీయంగా శుభాకాంక్షలను తెలుపుకోవటం గుర్తించతగిన విషయం

        🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

✍️ "సాంప్రదాయం "


Sunday, 11 March 2018

విభూతి ధారణ


                        విభూతి ధారణ



హోమంలో దర్బలు మరియు ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని  అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.
వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.
అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని  రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు, పిడకలు, రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు, నవధాన్యాలు, గంధపుచెక్కలు, నేరేడు, సాంబ్రాణి, ఆవునెయ్యి, సాంబ్రాణి, అగరొత్తులు  వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి.



కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ఞము , హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.

విభూతి పేర్లు - వర్ణములుసవరించు :- 

1. భస్మం - శ్వేత వర్ణము
2. విభూతి - కపిల వర్ణము,
3. భసితము -కృష్ణ వర్ణము
4. క్షారము - ఆకాశ వర్ణము
5. రక్షయని - రక్త వర్ణము

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి.భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

 1. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.

 2. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.

 3. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.

 4. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.

 5. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.

 6. శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.

 7. శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.

 8. శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.

 9. శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.

గమనిక :- హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.
స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.
ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే.
అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.

"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"

పరమ పవిత్రమైనది, అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరినీ వశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోక భావం.




"భస్మనా సజలే నైనధారయేచ్చత్రిపుండ్రకం"

అంటూ గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి.
మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే, కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.
స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. "ప్రయోగ పారిజాతం"లో కూడా ఇదే సంగతి రాశారు.
ఇతర ఏ వస్తువు లేదా పదార్ధాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా.
విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం.

విభూతి ధారణ చేయు విధానం :-

విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు

వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!

సాధ్యమయినంతమటుకు ఈమూడూ లేకుండా పూజ జరుగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.
శాస్త్రమునందు శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజామందిరంలోంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది.
నుదుటిమీద భస్మమును ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు యథార్థమునకు పచ్చిగంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమయినంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతానామం చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణా చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు దరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణహేతువు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి.

భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!

అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు

“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” 

అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని ధరించాలి. ఇవేమీ చేతకాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి

శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం”

అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భాసిస్తుంది. పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను.
ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భాస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుతారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.
భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.
శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది.

                      🙏 హరహర మహాదేవ శంభో శంకరా 🙏



✍️ " సాంప్రదాయం "




Sunday, 4 March 2018

శివ మానస పూజ


                            శివ మానస పూజ



రచన: ఆది శంకరాచార్య

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||


సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||



ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||


ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||



కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

     🙏  || హర హర  మహాదేవ శంభో శంకరా ||  🙏




✍️ " సాంప్రదాయం "

Saturday, 3 March 2018

శ్రీ ఆంజనేయస్తోత్రమ్

               

                                  శ్రీ ఆంజనేయస్తోత్రమ్



శ్లో|| రం రం రం రక్త వర్ణం దినకర వదనం తీ క్ ష్ణ దంష్ట్రా కరాళం!
రం రం రం రమ్యతేజం గిరి చలనకరం కీర్తి పంచాది వక్త్రం!
రం రం రం రాజయోగం సకలనిథిం సప్త భేతాళ భేద్యం!
రం రం రం రాక్ష సాంతం సకల దిశయశం రామదూతం నమామి !!




శ్లో||  ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విషజ్వర హరణం వేద వేదాంగ దీపం!
ఖం ఖం ఖం రూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం!!
ఖం ఖం ఖం కల్ప వృక్షం మణిమయ మకుటం మాయ మాయా స్వరూపం!
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి!!




శ్లో||  ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం!
ఇం ఇం ఇం సిద్ధ యోగం నత జన సదయం ఆర్య పూజార్చి తాంగం!!
ఇం ఇం ఇం సింహనాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాషం!
ఇం ఇం ఇం చిత్స్వ రూపం సకల దిశయశం రామదూతం నమామి!!




శ్లో|| సం సం సం సాక్షి రూపం వికసిత వదనం పింగాళాక్షం సురక్షం!
సం సం సం సత్యగీతం సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం!!
సం సం సం సామవేదం నిపుణసులలితం నిత్య తత్త్వం స్వరూపం!
సం సం సం సావధానం సకల దిశయశం రామదూతం నమామి!!




శ్లో|| హం హం హం హంసరూపం స్పుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం!
హం హం హం అంత రాత్మం రవి శశి
నయనం రమ్య గంభీర భీమం!!
హం హం హం అట్ట హాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం! 
హం హం హం హంసహంసం సకల దిశ
యశం రామదూతం నమామి!!



ఈ శ్రీ ఆంజనేయపంచరత్న స్తోత్రమ్ మీ
పిల్లలచేత కంఠస్థం చేయించెదరు గాక!!


                  🙏 !! జయ శ్రీ రామ !! 🙏



✍️ " సాంప్రదాయం "

Friday, 2 March 2018

శివుడు



                                         శివుడు



శ్లో|| శం నిత్య సుఖమానందమకారః పురుషః స్మృతః
       వకారశ్శక్తిరమృతం మేలనం శివ ఉచ్చతే
       తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వాశ్చయేచ్చివమ్‌ !!

అని ‘శివ’ శబ్దార్థాన్ని వివరించింది శివపురాణం. ‘శం’ అంటే శాశ్వతానందం,‘ఇ’ కారం పురుషుడు, ‘వ’ కారం శక్తి, అమృతం, వీటి కలయిక ‘శివ’ మనబడుతుంది. ఆ విధంగా ఏర్పడిన శివశబ్దానికి శుభము, మంగళప్రదము అనే అర్థాలున్నాయి.
అట్టి శివతత్త్వము మూర్తీభవించిన వాడు ‘శివుడు’. అనగా శుభప్రదుడు మంగళకరుడు అని అర్థం. అవ్యక్తుడైన పరమాత్మ బ్రహ్మది దేవతల కోరిక మీద వారు సేవించుకునేందుకు వీలుగా తన లింగ స్వరూపాన్ని వారికి అనుగ్రహించాడు. రూపాతీతమైన పరమాత్మ లింగ స్వరూపంగా ఆవిర్భవించిన రోజు శివుని పుట్టిన రోజుగా శివ పార్వతుల కల్యాణంగా శివరాత్రి జరుపుకుంటుంన్నాం.సమస్తమైన సృష్టి ఆ పరమాత్మ నుండే వెలువడింది. కనుక ఈ దృశ్యమాన ప్రపంచం అంతా శివ ‘స్వరూపమే’. శివారాధన అంటూ సకల చరాచర జగత్తునీ ఆరాధించి సమస్త జగత్తుతో అంతర్యామిగా ఉన్న దైవాన్ని అనుభూతి చెందటమే ఈ విషయాన్ని ప్రతిపాదించి ఆ దారిలో పయనించి భగవధనుభూతి మార్గానికి రాచబాట వేసింది. ‘రుద్రసూక్తం’ దీనినే వాడుకలో ‘రుద్ర నమకం’ అంటూ ఉంటాం.

శ్రీ శివస్తుతి

శాంతం పదమాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం !

శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవహస్తం !!

నాగ పాశం చ ఘంటాం ప్రళయ హంతవహం సాంకుశం వామభాగే !

నా నాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి !!

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం !

వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం !!

వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం !

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

నమో గౌరీశాయ!స్ఫటిక ధవళాంగాయచ నమో !

నమో లోకేశాయ!స్తుతి విభుధలోకాయ చ నమ !!

నమో :శ్రీకంఠాయ!క్షపిత పుర దౌత్యాయ చ నమో !

నమ: ఫాలాక్షాయ!స్మరమదివినాశాయ చ నమ !!

శంకరస్య చరితాకథామృతంచంద్రశేఖర గుణానుకీర్తనం !

నీలకంఠ తవపాద సేవనం సంభవతు మమ జన్మజన్మని !!

ప్రాత: కాలే శివం దృష్ట్వా  నిశిపాపం వినశ్యతి !

ఆజన్మకృత మధ్యాహ్నే సాయాహ్నే సప్త జన్మసు !!

మేరో : కాంచన దత్తానాం గవాం కోటిశతైరపి !

పంచకోటి తురంగానాం తత్ఫలం శివదర్శనం !!

శంభో!మహేశా!కరుణామయ శూలపాణే !

గౌరీపతే!పశుపతే! పశుపశనాశిన్ !!

కశిపతే ! కరునయా జగదేతదేక !

స్త్వం  హంసి  పాసి విదధాసి మహేశ్వరోసి !!



యజుర్వేదంలో ప్రధాన మంత్ర భాగం అయిన నమకంలో సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలకు నమస్కరించటం ఉంటుంది. అనగా ఆ రూపంలో ఉన్న దైవానికి నమస్కరిస్తున్నానని అర్థం. అటువంటి శివుని అర్చించే వారం తాము ‘శివ స్వరూపులుగా’ రూపొందాలి అంటే ‘శివ స్వరూపుడు’ మాత్రమే శివార్చనకు అర్హుడు.అ, ఉ, మ, బిందు నాదము ఉద్భవించిన క్రమంలోనే న, మ, శి, వా, య అనే అక్షరాలు ఉద్భవించి స్థూల పంచాక్షరిగా రూపుదాల్చాయి. సూక్ష్మ పంచాక్షరి నిరాకార సగుణ భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరం నుండి ‘5’ వర్ణాలున్న ‘5’ వర్గాల అక్షరాలు జనించాయి. శిరోమంత్రమనే నాల్గవ పాదంతో సహ 3 పాదాల గాయత్రీ మంత్రం పుట్టింది, దాని నుండి సమస్త వేదాలు వాటి నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయని ఆయా మంత్రాల వల్ల ఆయా సిద్ధులు మాత్రమే లభిస్తాయనీ కాని వాటికి మూలమైన ప్రణవం వలన సర్వసిద్ధులు కలుగుతాయనీ ఈ ప్రణవం వలన ‘భోగమూ’ మోక్షము కూడా సిద్ధిస్తాయనీ శివపురాణం తెలుపుతుంది.



అవాజ్మానస గోచరుడైన పరమాత్మ ఓం కారమనే ఒకే ఒక అక్షరం చేత నిర్దేశించబడతాడు. ‘ఓం’ కారము నందలి ‘ఆ’కారం సృష్టికారకుడైన బ్రహ్మనూ, ‘ఉ’కారం స్థితికారకుడైన విష్ణువు అనీ, ‘మ’కారం శివుని నిర్దేశిస్తాయి. అంతేకాదు అకారం సృష్టికర్త ‘ఉ’కారం మోహింప చేసేది.‘మ’కారంసదా అనుగ్రహదాయకం. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మను సూచిస్తే పంచాక్షరీ సాకారుడైన భగవానుని బోధిస్తుంది. పంచాక్షరిని నిత్యం జపించాలని ఉధయ సంధ్యలలో 1000 చొప్పున జనించినట్లయితే శివ పదం లభిస్తుందని చెప్పబడింది. ఈ పంచాక్షరి మంత్రం సర్వోపనిషత్తులకు ఆత్మస్వరూపం పరిపూర్ణ మంత్రం. 

శివుని అష్టమూర్తులు 


1) శర్వుడు - భూతత్త్వం.
2) భవుడు - జలతత్త్వం.
3) రుద్రుడు - అగ్ని తత్త్వం.
4) ఉగ్రుడు - వాయు తత్త్వం.
5) భీముడు - ఆకాశ తత్త్వం.
6) ఈశానుడు - సూర్య తత్త్వం.
7) మహా దేవుడు - చంద్ర తత్త్వం.
8) పశుపతి - యజమాని క్షత్రజ్ఞుడు. 

శివుని అష్టమూర్తులు అష్టతత్త్వాలని సూచిస్తాయి.

అష్టమూర్తులు ఈశ్వరుడే అని తెలిస్తే జీవేశ్వరుల అభేదం అవగతమై కైవల్యసిద్ధి లభిస్తుంది.ఎనిమిది తనువుల శివుని నామాలను అనుచారంగా మరో పద్ధతిలో అనుష్టించడం ఉంది.

భవాయ దేవాయ నమః ; శర్వాయ దేవాయ నమః ;
ఈశానాయ దేవాయ నమః ; పశుపతయే దేవాయ నమః ;
రుద్రాయ దేవాయ నమః ; ఉగ్రాయ దేవాయ నమః ;
భీమాయ దేవాయ నమః ;మహతే దేవాయ నమః ;

                                      🙏   ఓం నమః శివాయ 🙏



✍️ " సాంప్రదాయం "


Thursday, 1 March 2018

శివరాత్రి ఎలా జరుపుకోవాలి ?



                                         శివరాత్రి



శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

1.ఉపవాసం





శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన





అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

3. మౌనవ్రతం




శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటికి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

4.అభిషేకం





శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.జాగరణ





శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

6.మంత్ర జపం





శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు 
నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.


          🙏 ఓం నమః శివాయ శివాయ నమః ఓం 🙏



✍️ " సాంప్రదాయం "

శివరాత్రి


                                      శివరాత్రి





   ✨    శివరాత్రి అంటే  ఏమిటి....!!
   ✨    శివరాత్రి పూజావిధానం ఎలా....!!
    ✨   శివరాత్రులు ఎన్ని....!!
    ✨   శివరాత్రి  పండుగ  విశిష్టత  ఏమిటో  పూర్తిగా          తెలుసుకోండి....!!

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.


           ✨    శివరాత్రులు ఎన్ని....!!

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ.
ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
1. నిత్య శివరాత్రి,
2. పక్షశివరాత్రి,
3. మాసశివరాత్రి,
4. మహాశివరాత్రి,
5. యోగశివరాత్రి.

వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి.

మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, ఆరుద్ర నక్షత్రం రోజున
శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట.

ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి.
 
                        లింగోద్భవం



లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు.

ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు.

ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి, ప్రణవానికి సామ్యముందంటారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు..
ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి.

పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు.

మొదటిది  :-  విభూతిధారణ. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు.



విభూతి ధారణ చేసేటప్పుడు చదివే మంత్రం

శ్రీ కరం చ పవిత్రం చ శోక రోగ నివారణం !
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్యపావనం !!

రెండవది :-  రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.



         " యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’'

మూడవది :-  పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు

      శివ పంచాక్షరీ స్తోత్రము
రచన: ఆది శంకరాచార్య
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||
యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

    !!   ఓం నమః శివాయ శివాయ నమః ఓం !!
    !!    ఓం నమః శివాయ శివాయ నమః ఓం !!

 నాలుగవది :-  మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి.




త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!

అయిదవది :-  అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి.
             
            🙏  ఓం నమః శివాయ 🙏

శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి.



వేదాలన్నింటకీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ అవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే.
పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు.



ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని
మొదట పాలతో,
తర్వాత పెరుగుతో,
ఆ తర్వాత నేతితో,
ఆ తర్వాత తేనెతో
అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి.

దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు.

మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది –హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!వగైరా –



‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’

నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆరాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’

అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి.

అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు.

సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.

     ✨     ఉపవాసం అంటే ఏమిటి....!!




దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.

‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)

భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.

‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట.

చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి  అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివపూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

   ✨        శివరాత్రి ఎలా చేసుకోవాలంటే....!!




గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి.

అందమైన శివకథలు వినవచ్చు. వ్రతులు మరొకసారి శివరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి.

ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – 'పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివా – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను ఆర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే.

అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం.

ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు.

శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం .

ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.

శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు.

శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.

శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

               ✨    ప్రదక్షిణ విధులు....!!




శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

      ✨     బిల్వ దళం ప్రాముఖ్యత....!!




బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది.

బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి ఆజ్ఞ. బిల్వం ఇంటి ఆవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ.
వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

                      ఓం నమః శివాయ....!!
           హర హర మహాదేవ శంభో శంకర....!!     

                       🙏 ఓం నమః శివాయ 🙏



✍️  " సాంప్రదాయం "